Header Banner

ఏపీలో నిరుద్యోగులకు బంపర్ ఆఫర్! నెలకు రూ. 10,000 నుంచి 20,000 వరకు జీతం! అర్హతలు ఇవే..!

  Mon Feb 03, 2025 11:33        Others

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 4న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారులు తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో శ్రీరామ్ ఫైనాన్స్, బి న్యూ మొబైల్స్, adecco india వంటి నాలుగు ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  



దీనికోసం పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు. 04-02-2025 వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి నెల జీతం పదివేల రూపాయలు నుంచి 20 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం www.nipunyam.gov.in మరిన్ని వివరాలకు 9701303790 అనే నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jobmela #jobs #offers #topcompanies #todaynews #flashnews #latestupdate